చేతి వృత్తుల వారికి ప్రాధాన్యం
బీజేపీ ఆర్టిసన్ సెల్ కన్వీనర్ బంగారుబాబు
విజయవాడ: రాష్ట్ర బీజేపీ కార్యాలయంలో శుక్రవారం ఆర్టిసన్ సెల్ రాష్ట్ర కన్వీనర్ బంగారు బాబు విలేఖరుల సమావేశంలో మాట్లాడారు. భారత ప్రభుత్వం జౌళి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో హస్తకళలో రాణించిన కళాకారులకు శిల్ప గురు బహుమతులు అందించనున్నారు. చేతి వృత్తి కళాకారులను గుర్తించి తగిన ప్రాధా న్యం ఇస్తుందని చెప్పారు. పలు రంగాలలో ఉన్న చేతి వృత్తి కళాకారులను గుర్తించి వారికి రాష్ట్రపతి చేతులమీదుగా బహుమతులు ఇవ్వటం జరుగుతుందని వెల్లడిర చారు. కళాకారులని తీర్చిదిద్దిన గురువులను సైతం కేంద్ర ప్రభుత్వం సత్కరి స్తుందని, శిల్ప గురు బహుమతులు అందుకున్న కళాకారులకు తగిన గుర్తింపు ఉంటుందని తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లో కళారంగాన్ని ప్రోత్సహించటానికి ఒక హబ్‌గా తీర్చిదిద్దేందుకు కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు.