విజయవాడ: ఎన్నికల కౌంటింగ్ సరళిని మైక్రో లెవెల్‌లో అబ్జర్వేషన్ చేసేందుకు ఏపీ బీజేపీ ఎన్నికల సహ ఇన్‌చార్జ్ సిద్దార్థ్‌నాథ్ సింగ్ సోమవారం విజయవాడ చేరుకున్నారు. గన్నవరం విమానాశ్రయంలో బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వేటుకూరి సూర్యనారా యణరాజు, మైనారిటీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు షేక్ బాజీ, బీజేపీ నేతలు కిలారు దిలీప్, పియూష్‌లు స్వాగతం పలికారు. రాష్ట్ర ఎన్డీఏ కూటమి సమన్వయం, జాతీయ నాయకుల పర్యటనలు ఆయన స్వీయ పర్యవేక్షణలోనే జరిగాయి. ఈ నేపథ్యంలో కౌంటింగ్ సరళి ఎలా ఉంటుంది, ఇక్కడ భవిష్యత్ కార్యాచరణ వంటి విషయాలతో పాటు ఇతర అంశాలను సిద్దార్థ్‌నాథ్ సింగ్ స్వయంగా పర్యవేక్షించనున్నారు.