టీడీపీ అధినేత చంద్రబాబు ప్రమాణ స్వీకారం తేదీ మార్పు?

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టనున్న టీడీపీ అధినేత చంద్రబాబు ప్రమాణ స్వీకారం తేదీలో మార్పులు చోటు చేసుకున్నాయి. ఈ నెల 9కి బదులు 12న చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేస్తారని ప్రకటించారు.

టీడీపీ అధినేత చంద్రబాబు ప్రమాణ స్వీకారం ఇంకాస్త వెనక్కు వెళ్ళింది. ఈ నెల 9 న మోడీ ప్రమాణ స్వీకారం ఉండటంతో 12 న చేయాలని చంద్రబాబు నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. ముందుగానే రెండు తేదీల్లో పండితులు మంచి ముహూర్తాలు చూసారు. అందుకే ప్రమాణ స్వీకాంలో మార్పు చేసుకోవడానికి ఏ ఇబ్బందీ రాలేదని చెప్పారు. అలాగే ప్రమాణస్వీకారం చేసే ప్రాంతం పై ఇవాళ స్పష్టత వచ్చే అవకాశం ఉంది.