టీడీపీపై సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తోందని, అడ్డుకట్ట వేయకుంటే చర్యలు తప్పవని టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి హెచ్చరించారు. చంద్రగిరి మండలంలో ఓ దాబా వద్ద వైసీపీ నాయకుడు, చంద్రగిరి పట్టణం వార్డు మెంబర్ వంశీపై టీడీపీ నాయకులు దాడి చేస్తున్నారంటూ వైసీపీ షేర్ చేసిన వీడియో ఫేక్ అని పేర్కొన్నారు. ఇలాంటి ఫేక్ న్యూస్పై కఠిన చర్యలు ఉంటాయన్నారు.