ఎన్నికల కోడ్ ఎత్తివేత..

దేశంలో ఎన్నికల కోడ్ ముగిసింది. ఈ ఏడాది మార్చి 16వ తేదీన అమల్లోకి వచ్చిన ఎన్నికల ప్రవర్తనా నియమావళిని కేంద్ర ఎన్నికల సంఘం ఎత్తివేసింది. దేశవ్యాప్తంగా ఎన్నికల ప్రక్రియ ముగియడంతో ఎన్నికల కోడ్ ఎత్తివేస్తున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. దీంతో తెలుగు రాష్ట్రాల్లోనూ ఎన్నికల కోడ్ తొలగినట్లయింది.