లోకేష్ కి 91000+ మెజారిటీ ఎలా వచ్చింది అబ్బా అని ప్రతి ఒక్కరు మనసుని తొలిచివేసే ప్రశ్న.
ఎలక్షన్లు అయిపోయిన తర్వాత రోజు నుంచి ఇప్పుడు దాకా మంగళగిరిలో 70 కుటుంబాలకి వారి అవసరాన్ని ఆర్థిక స్థితిని బట్టి 10000 నుంచి 15000 దాకా సహాయం అందించారు లోకేష్ మీకు ఎక్కడైనా న్యూస్ బయటకు వచ్చిందా?… ఏ ఒక్క వైసీపీ నాయకుడైన చేశాడా? మీరు మా కులం మీరు మా మతం అనే మీ దగ్గరికి వచ్చిన ఏ వైసీపీ నాయకుడైనా ఎలక్షన్ల ముందుగానీ ఎలక్షన్ల తర్వాత గాని మీకు ఒక సహాయం చేశారా? మీ గుండె మీద చెయ్యి వేసుకుని ఆలోచించండి?
మీరు మంగళగిరి మెయిన్ సెంటర్లో చూస్తే “నారా లోకేష్ సహాయంతో” అని చాలా తోపుడుబల్లల్లో చాలా షాపుల మీద బోర్డ్లు కనపడతాయి…అవన్నీ ఆయన ఓడిపోయిన దగ్గరనుంచి మంగళగిరిలో ప్రజలకు అందిస్తున్న సహాయానికి నిదర్శనం… సరే అది ఆయన ఎలక్షన్ లోకి గెలవడం కోసమే అని అనుకుంటారు కదా అందరూ…
కానీ మీకు తెలియని విషయం ఒకటి చెప్తా …
ఆయన వాళ్ళ టీం కి చెప్పిందేంటో తెలుసా “మన పార్టీ కాకపోయినా, మనకి ఓటు వెయ్యరు అనుకున్న, వాళ్ళకి మన పేరు వేయించుకోవడానికి ఇబ్బందిగా నామోషిగా ఉన్నా సరే, అలాంటి వారికి కూడా సహాయం చేసి మన పేరు ఏమి వేయించుకోవద్దు అని కూడా చెప్పండి… ఎందుకంటే మంగళగిరి మంగళగిరిలో ఉన్న ప్రజలందరూ నా అక్కలు ,అన్నలు, అమ్మలు చెల్లెలే…వాళ్లకి నాతో పార్టీ తో బేధాలు ఉండొచ్చు గానీ నా మనసులో నాకు ఏ భేదం లేదు”..అని చెప్పి పంపించారు…అందుకు 91000 మెజార్టీ వచ్చింది
రోడ్లు లేవంటే ఆయన సొంత టీం ని సొంత మెషినరీ పెట్టేసుకొని ఎంతోమంది ఇళ్ళకి రోడ్లు వేసి ఇచ్చాడు… ఆయన రోడ్లు వేస్తూ ప్రజల దగ్గరికి కాదు వెళ్ళింది వారి మనసుల్లోకి అని 91000 మెజారిటీ వచ్చినాకే తెలిసింది…
స్త్రీ శక్తి అనే పధకాన్ని ఒకటి మొదలుపెట్టి ప్రతి ఆడబిడ్డని సొంత కాళ్ళ మీద నిలబడేటట్టు వారికి నైపుణ్యం నేర్పారు… అలా ఆయన సాయం అందించిన ప్రతి ఆడబిడ్డలో ఆయన తల్లినే చూసుకున్నాడు… అందుకు 91000 మెజారిటీ వచ్చింది..
ఆయన మంగళగిరిలో ఆయన సొంత ఖర్చులతో అధునాతనమైన ఎక్విప్ మెంట్ తో సొంత డాక్టర్లని పెట్టి ఒక హాస్పటల్ నడిపాడు.. మంగళగిరి చుట్టూతా ఉన్న గ్రామాల్లో ఆటోలో కూడా రావటానికి డబ్బులు లేని వారికి రెండు బస్సులు వేసి చుట్టూరా ఉన్న గ్రామాల్లో పేద ప్రజలను, ముసలి వాళ్ళని ఆ హాస్పటల్ కి తెచ్చి వారికి అవసరమైన టెస్టులు చేసి అవసరమైన నాణ్యమైన మందులు ఇచ్చారు… అందుకు వచ్చింది 91000 మెజారిటీ…
రాజులేని రాజ్యాన్ని సృష్టించిన వాడే కదా నిజమైన రాజు…
నాయుడు గారు మీరు కన్నది కొడుకుని కాదు… రాజుని… మకుటం లేని మహారాజుని…