ఆయన మృతి తెలుగుజాతికి తీరనిలోటు
సత్తెనపల్లి ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ
సత్తెనపల్లి: రామోజీరావు మృతికి సత్తెనపల్లి ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ ఒక ప్రకటనలో సంతాపం వ్యక్తం చేశారు. తెలుగు పత్రిక, సాహితీ రంగంలో సంచలనానికి నాంది పలికిన ఈనాడు, సితార, చతుర, విపుల, రైతు బంధు ‘అన్నదాత’ ఇవన్నీ మీ మానస పుత్రికలే. మార్గదర్శి ఎందరికో తోడుగా నిలబడి ఆర్థిక స్వావలంబన దిశగా సహాయపడిరది. రామోజీ ఫిల్మ్ సిటీ తెలుగు వారి సత్తా ప్రపంచానికి చాటి చెప్పింది. ప్రియా పచ్చళ్లు ప్రతి ఇంట్లో రుచులకు తోడయ్యాయి. డాల్ఫిన్ హోటల్స్ హాస్పిటాలిటీ రంగంలో ల్యాండ్ మార్క్. ఇక ఈటీవీ హుందాగా ఎలా వార్తా కథనాలు ఇవ్వాలో నేర్పించి మంచి తెలుగు భాష నిలబడి ఉండేలా కృషిచేసింది. మీ కలం ఆంధ్రా రాజకీయాలలో పెను మార్పు లు తెచ్చింది. తెలుగు రాష్ట్రాలకు మీరు అందించిన సేవలు అమూల్యం, చిరస్మర ణీయం. మిమ్మల్ని కోల్పోవడం తెలుగు జాతికి దురదృష్టకరం. మీ ఆత్మకు శాంతి చేకూర్చాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాను.