జగన్‌పై మాజీ మంత్రి కొట్టు సంచలన వ్యాఖ్యలు

ఆయన చేసిన తప్పులే పరాజయానికి కారణం
ఐ ప్యాక్‌ ఒక పనికిమాలిన సంస్థ..దానిని నమ్ముకున్నారు
ప్రజాప్రతినిధులు, నేతలకు సముచిత స్థానం ఇవ్వలేదు

తాడేపల్లిగూడెం: వైసీపీ అధినేత జగన్‌పై ఆ పార్టీ మాజీ మంత్రి కొట్టు సత్యనారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఐ ప్యాక్‌ ఒక పనికి మాలిన సంస్థ అని మండిపడ్డారు. జగన్‌ ప్రజా ప్రతినిధులకు, నేతలకు సముచిత స్థానం ఇవ్వకుం డా పక్కనపెట్టి ఐప్యాక్‌ను నమ్ముకోవడం వల్లే ఎన్నికల్లో వైసీపీ ఓటమిపాలైందని తెలిపారు. జగన్‌ చేసిన తప్పులే వైసీపీ పరాజయానికి కారణమని పేర్కొన్నారు.