ఢిల్లీ: దేశంలో బాంబు బెదిరింపులు కలకలం రేపుతున్నాయి. తాజాగా ఢిల్లీ ప్రాంతంలోని రైల్వే మ్యూజియం సహా మొత్తం 10 నుంచి 15 మ్యూజియాలకు కొందరు వ్యక్తులు మంగళవారం బాంబు బెదిరింపు మెయిల్స్ పంపారు. దీంతో వెంటనే అప్రమత్తమైన ఢిల్లీ పోలీసులు రంగంలోకి దిగి ఆయా మ్యూజియాల దగ్గర, సమీప ప్రాంతాల్లో పెద్దఎత్తున తనిఖీలు చేపట్టారు. అయితే ఎలాంటి అనుమానాస్పద వస్తువులు, పేలుడు పదార్థాలు కనిపించలేదు. దీంతో ఇది బూటకపు మెయిల్ అని భావిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేశారు.