రాజమహేంద్రవరం సిటీ : రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ రాజమండ్రి ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి ని మర్యాదపూర్వకంగా ఈ రోజు కలిశారు. ఆయనతో పాటు జనసేన పార్టీ రాజమండ్రి ఇంచార్జ్ అత్తి సత్యనారాయణ కూడా ఉన్నారు. ఈ సందర్భంగా నగర పాలక సంస్థ ఎస్ఈ పాండు రంగారావు, ఈఈతో సమావేశమై రాజమహేంద్రవరం నగర అభివృద్ధి విషయమై చర్చించారు.