-బాబుతో పవన్ భేటీ
– ఆలింగనం చేసుకున్న బాబు-పవన్
అమరావతి: సచివాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కి సీఎం సాదరంగా ఆహ్వానం పలికారు. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక తొలిసారి సెక్రటేరియట్ లోని తన ఛాంబర్ కు వచ్చిన పవన్ కళ్యాణ్ ని ముఖ్యమంత్రి ఆలింగనం చేసుకుని స్వాగతం పలికారు. పవన్ కళ్యాణ్ తో పాటు మంత్రులు నాదెండ్ల మనోహర్ , కందుల దుర్గేష్ సీఎంను కలిశారు.