– నిర్మలాసీతారామన్ను కలిసిన బీజేపీ,టీడీపీ నేతలు
ఢిల్లీ: కేంద్ర ఆర్ధికమంత్రి నిర్మలాసీతారామన్ను కేంద్రమంత్రివర్గంలో చోటు సంపాదించుకున్న శ్రీనివాస వర్మ సహా బీజేపీ,టీడీపీ నేతలు కలిశారు. రాష్ట్రానికి కేంద్ర నిధులు ఇప్పించడంలో చొరవ చూపాలని కోరారు. ఈ సందర్భంగా కేంద్రమంత్రిగా నియమితులైన భూపతిరాజు శ్రీనివాస వర్మను సీతారామన్ అభినందించారు. శాఖకు మంచిపేరు తీసుకురావాలని, నిరంతరం అధ్యయనం చేసి ప్రజలకు సేవలందించాలని సూచించారు. శ్రీనివాసవర్మ వెంట మాజీ మంత్రి పితాని సత్యనారాయణ, ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్, నాయకర్, బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు సోము వీర్రాజు, కరిమిల్లి, ధర్మరాజు తదితరులున్నారు.