-రేవంత్ రెడ్డి కి జాబ్ కేలండర్ విడుదల చేయడం చేతకాదు
-కాంగ్రెస్ కు నిరుద్యోగ యువత అరిగోస
-ఒక్కో ప్రాంతానికి ఒక్కో కట్ ఆఫ్ మార్కు ఇవ్వడం ఏమిటి ?
-46 ను రద్దు చేస్తామని హామీ ఇచ్చి ఇపుడు వెనక్కి పోవడం ఏమిటి ?
– బీఆర్ఎస్ నేత ఏనుగుల రాకేష్ రెడ్డి
హైదరాబాద్: అన్నం పెట్టే వాడికి సున్నం పెట్టడం కాంగ్రెస్ డిఎన్ఏ లోనే ఉంది. కాంగ్రెస్ నిరుద్యోగ యువత అరిగోస పుచ్చుకుంటున్నది. మార్పు కోసం కాంగ్రెస్ కు నిరుద్యోగ యువత అవకాశం ఇచ్చింది. మార్పు కోసం ఓటేసిన పాపానికి నిరుద్యోగ యువత ను కాంగ్రెస్ వేధిస్తోంది.
ఇపుడు కాంగ్రెస్ తీరు తో అన్ని వర్గాలు రోడ్డు ఎక్కుతున్నాయి. ఎన్నికల కోడ్ పేరిట అన్నిటిని కాంగ్రెస్ ప్రభుత్వం వాయిదా వేసింది. ఇపుడు కోడ్ పోయింది అయినా కాంగ్రెస్ ప్రభుత్వం ఏ హామీని నెరవేర్చడం లేదు. నిరుద్యోగులకు జాబ్ కేలండర్ విడుదల చేస్తామన్నారు ..ఏమైంది ? గ్రూప్ 2 లో 783 పోస్టులు యిచ్చి చేతులు దులుపుకున్నారు ..2 వేల పోస్టులు ఇవ్వాలి. గ్రూప్ 3 లో మరో మూడు వేల ఉద్యోగాలకు నోటి ఫికెషన్లు ఇవ్వాలి.
రేవంత్ రెడ్డి కి జాబ్ కేలండర్ విడుదల చేయడం చేతకాదు ..ఆయన పీ ఆర్ స్టంట్ లలో బిజీ గా ఉన్నారు. మెగా డీఎస్సి లో 25 వేల టీచర్ పోస్టుల ను భర్తీ చేయాలి. జీవో 46 పై ప్రతిపక్షం లో ఉండగా కాంగ్రెస్ ఏం చెప్పింది ..ఇపుడేం చేస్తోంది ? జీవో 46 పై సీఎస్ కు నా ఫిర్యాదు ఇవ్వాలని వెళితే అపాయింట్మెంట్ ఇవ్వలేదు. నేను గోడ మీద పిర్యాదు ను అతికించి వచ్చినా ప్రభుత్వం నుంచి స్పందన లేదు.
కాంగ్రెస్ కు మెజారిటీ వచ్చినా గవర్నర్ వాళ్ళను ప్రభుత్వ ఏర్పాటుకు పిలవక పోతే రేవంత్ రెడ్డికి భాధ ఉంటుందా లేదా? అలాగే పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగార్ధులు తగిన మార్కులు వచ్చినా ఉద్యోగాలు ఇవ్వక పోవడం ఏమిటి తెలంగాణ లోని ఒక్కో ప్రాంతానికి ఒక్కో కట్ ఆఫ్ మార్కు ఇవ్వడం ఏమిటి ?
బీ ఆర్ ఎస్ ప్రభుత్వం జీవో 46 తెచ్చి ఉండవచ్చు ..మళ్ళీ అధికారం లోకి వస్తే దాన్ని రద్దు చేస్తామని కే టీ ఆర్ హామీ ఇచ్చారు. కాంగ్రెస్ జీవో 46 ను రద్దు చేస్తామని హామీ ఇచ్చి ఇపుడు వెనక్కి పోవడం ఏమిటి ? అనేక చట్టాలు మార్చుకుంటున్నపుడు జీవో లు మార్చుకుంటే తప్పు ఏమిటి ? మాది ఉద్యమ పార్టీ. ఉడుం పట్టు తో నిరుద్యోగుల తరపున పోరాడతాం.