తలసాని ని పరామర్శించిన గుత్తా సుఖేందర్ రెడ్డి

హైదరాబాద్, జూన్ 21 మహానాడు : మాజీమంత్రి, సనత్ నగర్ ఎం ఎల్ సి తలసాని శ్రీనివాస్ యాదవ్ ను శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి పరామర్శించారు. ఇటీవల మాజీమంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సోదరుడు తలసాని శంకర్ యాదవ్ మరణించగా, శుక్రవారం మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి,ఎం ఎల్ సి ఎం ఎస్ ప్రభాకర్ రావు లు వెస్ట్ మారేడ్ పల్లి లోని శంకర్ యాదవ్ నివాసానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా శంకర్ యాదవ్ చిత్రపటం వద్ద నివాళులు అర్పించారు. అనంతరం శ్రీనివాస్ యాదవ్, ఇతర కుటుంబ సభ్యులను పరామర్శించి తమ ప్రగాఢ సంతాపం, సానుభూతిని తెలిపారు.