వైసిపి కోవర్టు ప్రభుత్వ సిబ్బందిని కీలక బాధ్యతలనుంచి తొలగించండి

ముఖ్యమంత్రిని కలిసి వివరాలు అందజేసిన బ్రాహ్మణ చైతన్య వేదిక

అమరావతి:బ్రాహ్మణ చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు సిరిపురపు శ్రీధర్ ఆధ్వర్యంలో శనివారం ముఖ్యమంత్రి నార చంద్రబాబునాయుడును కలిసి దేవాదాయశాఖతో పాటు మిగిలిన కొన్ని శాఖల అవినీతి అధికారులు, వైసిపి కోవర్ట్ అధికారుల వివరాల లిస్టు అందజేసి వైసీపీ ప్రభుత్వంలో ప్రజలను టిడిపి నేతలని శ్రేణులను వేధించిన కొంతమంది అధికారులు మళ్లీ టిడిపి ప్రభుత్వంలో కీలక బాధ్యతలు స్వీకరించడానికి పైరవీలు ప్రారంభించారని దీనిపట్ల ప్రభుత్వం జాగ్రత్త వహించాల్సిందిగా శ్రీధర్ చంద్రబాబుకు విన్నవించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ అవినీతి అధికారులు వైసిపి కోవర్ట్ అధికారులు సిబ్బంది ఎవరెవరున్నారు అనేది జిల్లాల వారీగా మరియు వివిధ శాఖల ప్రధాన కార్యాలయాల్లో సేకరిస్తున్నట్లు వారిపై ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని చంద్రబాబు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అమరావతి జేఏసీ నాయకులు పువ్వాడ సుధాకర్, ఎండపల్లి శబరి, వంగవీటి చైతన్య, నందివెలుగు చందు తదితరులు పాల్గొన్నారు.