మంగళగిరి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డీజీపీ ద్వారకా తిరుమల రావు ని టీడీపీ పార్లమెంటరీ పార్టీ నేత లావు శ్రీకృష్ణదేవరాయలు మర్యాదపూర్వకంగా కలిశారు. మంగళగిరిలోని డీజీపీ కార్యాలయంలో ద్వారకా తిరుమల రావుని కలసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్బంగా పల్నాడులోని పలు ముఖ్యమైన అంశాలపై డిజిపితో శ్రీకృష్ణదేవరాయలు చర్చించారు. శ్రీకృష్ణదేవరాయలు వెంట నరసరావుపేట నియోజకవర్గ జనసేన సమన్వయ కర్త సయ్యద్ జిలాని, సీనియర్ నాయకులు, మాజీ ఎమ్మెల్యే మక్కెన మల్లికార్జున రావు ఉన్నారు.