ప్రజలను కలిసేందుకు ఇక ప్రత్యేక విధానం
మంగళగిరి: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కి వినతులు వెల్లువెత్తాయి. మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయానికి వెళ్లిన చంద్రబాబు నాయుడుని వందల మంది కలిసి వినతులు సమర్పించారు. వివిధ ప్రాంతాల నుండి వచ్చిన సామాన్య ప్రజలు, కార్యకర్తలు ముఖ్యమంత్రిని కలిసి తమ బాధలు చెప్పుకున్నారు. తమ వ్యక్తి గత సమస్యలను విన్నవించి సాయం అర్దించారు. ఓపిగ్గా అందరి నుండి వినతి పత్రాలు తీసుకున్న చంద్రబాబు నాయుడు సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. భారీగా తరలి వస్తున్న ప్రజలను కలిసేందుకు, ఇకపై ప్రత్యేక విధానాన్ని రూపొందించాలని పార్టీ నేతలకు సూచించారు.