8వ తేదీన విస్తృత కార్యవర్గ సమావేశం

ప్రతీ శక్తి కేంద్రంలో మన్ కీ బాత్
ఆడియో కాన్ఫరెన్స్ లో బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి వెల్లడి

అమరావతి: సార్వత్రిక ఎన్నికల అనంతరం తిరిగి ప్రధానమంత్రి నరేంద్రమోదీ మన్ కీబాత్ కార్యక్రమం ప్రారంభం అవుతోందని బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి వెల్లడించారు.

ఈ రోజు ఆడియో కాన్ఫరెన్స్ ద్వారా బిజెపి శ్రేణులను ఉద్దేశించి పురందేశ్వరి మాట్లాడుతూ రేపు అనగా ఆదివారం 30వ తారీఖున మన్ కి బాత్ నిర్వహించుకోబోతున్నాము, ప్రతి శక్తి కేంద్ర స్థాయిలో ను, మనకు ఉన్నటువంటి పోలింగ్ బూత్ కమిటీల ఆధ్వర్యంలో మన్ కీ బాత్ వీక్షణ కు అవసరమైన ఏర్పాట్లు చేసుకోవాలన్నారు.

రాష్ట్రవ్యాప్తంగా 10 వేలకు పైగా ఏర్పాటు చేసుకున్న శక్తి కేంద్రాల్లో మన్ కీబాత్ వీక్షణకు ఏర్పాట్లు చురుకుగా నిర్వహించుకోవాలన్నారు. జిల్లా కార్యవర్గాలు వీటి పర్యవేక్షణ చేయాలన్నారు.

జూలై 8వ తేదీన రాష్ట్ర స్ధాయి బిజెపి విస్తృత కార్యవర్గం సమావేశం

ఎన్నికల అనంతరం విస్తృత కార్యవర్గ సమావేశం రాజమహేంద్రవరంలో ఒక రోజు ఏర్పాటు చేసుకుంటున్నామని ఇదే. విషయం ఆడియో కాన్ఫెరెన్సు లో ప్రకటించారు.

మండల అధ్యక్షులు తో సహా జిల్లాలో బాధ్యతలు ఉన్నవారు అదేవిధంగా పార్టీ అనుబంద మోర్చాలు , డిపార్ట్ మెంట్ లు లో భాద్యతలు ఉన్నవారు కూడా ఈ సమావేశానికి హాజరు కావడానికి అర్హులు అన్నారు. రాజమహేంద్రవరం లోని సరోవర్ కన్వెషన్ హాలు లో ఏర్పాటు చేయడం జరిగిందని పురందేశ్వరి వివరించారు