పోలవరం ఆలస్యం జగన్ పాపమే
నాలుగేళ్లలో పోలవరం పూర్తి
– ఏపీ బీజేపీ ప్రధాన అధికార ప్రతినిధి లంకా దినకర్
విజయవాడ: పోలవరం ప్రాజెక్టుపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శ్వేతపత్రం విడుదల చేయడం వల్ల వాస్తవాలు బహిర్గతం అయ్యాయి. పోలవరం బహుళ ప్రయోజనకర ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్ జీవనాడి. ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టంలోని సెక్షన్ 90 ప్రకారం పోలవరం నీటిపారుదల ప్రాజెక్టు జాతీయ ప్రాజెక్టు.
కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఈ ప్రాజెక్ట్ 2019కి ముందు మొత్తం 72% ప్రాజెక్ట్ పూర్తయింది. పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్టుని జాతీయ ప్రాజెక్టుగా గుర్తించిన తరువాత ఇప్పటివరకు కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన మొత్తం నిధులు 14,418.39 కోట్ల రూపాయలు.
2019 ముందు ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలోని వైకాపా పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్టు వ్యయంలో మరియ సహయ, పునరావాస వ్యయం అంచనాలలో పూర్తి అవినీతిమయం అని ఆరోపణలు చేసింది.
జగన్ అధికారంలోకి వచ్చాక చేసిన ఆరోపణలకు సాక్ష్యలు చూపకుండా గత ప్రభుత్వం తయారు చేసిన అంచనాలనే కేంద్ర ప్రభుత్వ ఆమోదం కొరకు ప్రయత్నించారు. రివర్స్ టెండరింగ్ అంటూ ప్రాజెక్టు వ్యయం తగ్గించామనే ప్రచారం చేసినప్పుడు, ప్రాజెక్టు వ్యయం తగ్గకపోగా దాదాపు మరో 33% పెరగడం చూస్తున్నాం.
వైఎస్ జగన్ నేతృత్వంలోని వైస్సార్సీపీ ప్రభుత్వ అనాలోచిత “రివర్స్ టెండరింగ్” మంత్రం కారణంగా తీవ్రమైన ఆలస్యం మరియు నష్టం జరిగింది. రివర్స్ టెండరింగ్ వల్ల భవిష్యత్ నష్టాల గురించి 3 ఆగస్ట్ 2019నే మేము హెచ్చరించడం జరిగింది
ఈ ప్రాజెక్ట్ పురోగతిలో తప్పుడు పాలన మరియు అవినీతి కారణంగా రాష్ట్రానికి ప్రాజెక్ట్ నిర్మాణాలు (ఆలస్యం కారణంగా కోతకు గురి కావడం), ఆర్థిక (వ్యయ పెరుగుదల) మరియు సమయం (అసాధారణ ఆలస్యం) నష్టం జరిగింది.
ప్రజలకు తాగునీరు, రైతులకు సాగునీరు, ఫ్యాక్టరీలకు పారిశ్రామిక నీటిని అందించడంలో వైఎస్ జగన్ రాజీపడినందున, చివరకు రాష్ట్రంలోని ప్రజలంతా, రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు తమ అవసరాలను మరియు అవకాశాలను ప్రజలు కోల్పోయారు. ప్రజలకు ఆదాయం మరియు సంపద నష్టం, రాష్ట్ర – కేంద్ర ప్రభుత్వాలకు జీడీపీ మరియు రెవిన్యూ నష్టం సంభవించింది.
పోలవరం ప్రాజెక్టు ముఖ్యమైన అంశాలు :
జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి గా 2019 లో ప్రమాణం చేసే నాటికి పోలవరం నిర్మాణం పనులు 70 % పైగా జరిగాయి, గడచినా 5 సంవత్సరాలలో కనీసం 10 % పనులుకూడా పూర్తీ కాలేదంటే వైకాపా నేతృత్వంలోని ప్రభుత్వానికి పోలవరం పైన ఎంత శ్రద్ధ పెట్టిందో అర్ధం అవుతుంది.
2019 ముందు పూర్తీ అయిన పనులు నిధులు కేంద్ర ప్రభుత్వం భర్తీ చేసినా తిరిగి ప్రాజెక్టు కోసం ఖర్చు పెట్టకుండా విడుదల చేసిన నిధులు 6 వేల కోట్లను పక్కకు మళ్లించడం వల్ల ప్రాజెక్టు పనులు నత్తనడకన నడిచాయి.
పోలవరం ప్రాజెక్టు అనుబంధంగా ఉన్న 960 మెగావాట్ల విద్యుత్ ప్లాంట్ అస్మదీయుల ద్వారా కొట్టేయడానికి ఉన్న శ్రద్ధ, ప్రాజెక్టు పైన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పెట్టలేదు.
సకాలంలో ప్రస్తుత వైకాపా రాష్ట్ర ప్రభుత్వం ప్రాజెక్టు పనులు పూర్తీ చేయకపోవడం వల్ల డయఫ్రామ్ వాల్, రివిట్మెంట్ , ఎర్త్ కామ్ రాక్ ఫీల్ డ్యామ్ దెబ్బతిని మూడు వేల కోట్ల పైగా నిధులు వృధా అయ్యాయి.
వైకాపా ప్రభుత్వంలో పోలవరం ప్రాజెక్టు డీపీఆర్ లో ఉన్న డిజైన్ ప్రాధాన్యత ప్రకారం కాకుండా పోలవరం ప్రాజెక్టు అథారిటీ, సెంట్రల్ వాటర్ కమిషన్ అనుమతి లేకుండా నిర్మాణాలు చేసి ఆ వ్యయం రీయంబర్స్మెంట్ కి కేంద్రం వద్దకు రావడం వల్ల కూడా నిధులు విడుదలకు ఆలస్యం అయ్యింది.
పోలవరం ప్రాజెక్టు అథారిటీ, సెంట్రల్ వాటర్ కమిషన్ లతో వైకాపా నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం సమన్వయంతో పని చేయలేదు. రాబోయే 4 సంవత్సరాలలో ఎన్డీఏ నేతృత్వంలో కేంద్ర మరియు రాష్ట్ర సహకారంతో పోలవరం ప్రాజెక్ట్ ను పూర్తి చేస్తాం.
పోలవరం పూర్తి చేయడంతోపాటు తప్పనిసరిగా “ మహానది – గోదావరి – కృష్ణ – పెన్న – కావేరి “ నదుల అనుసంధానం మరియు అనువైన ప్రాంతాలలో నీటి నిల్వ ట్యాంకుల నిర్మాణం ద్వారా అన్ని రాష్ట్రాల మరియు దేశ పురోగతికి దోహద పడుతుంది.