అమరావతి :- తెలంగాణకు చెందిన ఆదిలాబాద్ మాజీ ఎంపీ రమేష్ రాథోడ్ మృతి పట్ల సీఎం నారా చంద్రబాబు నాయుడు సంతాపం తెలిపారు. రమేష్ రాథోడ్ అకాల మరణం తనను దిగ్బ్రాంతికి గురి చేసిందని అన్నారు. తెలుగుదేశం పార్టీతో రమేష్ రాథోడ్ కు ఉన్న అనుబంధాన్ని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గుర్తు చేసుకున్నారు. ఆదిలాబాద్ ఎంపీగా, జడ్పీ ఛైర్మన్ గా, ఖానాపూర్ ఎమ్మెల్యేగా గిరిజన ప్రజలకు రమేష్ రాథోడ్ విశేష సేవలందించారన్నారు. వారి కుటుంబ సభ్యులకు ముఖ్యమంత్రి ప్రగాఢ సానుభూతిని తెలిపారు.
డి. శ్రీనివాస్ మృతికి సీఎం చంద్రబాబు నాయుడు సంతాపం
అమరావతి:- తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత, ఉమ్మడి రాష్ట్ర పిసిసి మాజీ అధ్యక్షుడు ధర్మపురి శ్రీనివాస్ మృతికి సీఎం నారా చంద్రబాబు నాయడు సంతాపం తెలిపారు. సుదీర్ఘ కాలం రాజకీయాల్లో ఉన్న డి. శ్రీనివాస్ మంత్రిగా, ఎంపిగా తనదైన ముద్ర వేశారని చంద్రబాబు అన్నారు. ఆయన మరణం దిగ్భ్రాంతిని కలిగించిందని అన్నారు. శ్రీనివాస్ ఎప్పుడూ హూందాగా రాజకీయాలు చేసేవారని….తాను నమ్మిన సిద్ధాంతం కోసం పనిచేశారని అన్నారు. డి.శ్రీనివాస్ కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని సీఎం చంద్రబాబు ప్రార్థించారు.