ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డిపై ఈడీ కేసు నమోదు

* ఎమ్మెల్యే తోపాటు అయన సోదరుడి ఇళ్లలో ఈడీ సోదాలు 
* పలు అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపణలు 

హైదరాబాద్, మహానాడు :  పటాన్ చెరు బీఆర్ఎస్ శాసన సభ్యులు మహిపాల్ రెడ్డి పలు అక్రమాలకు పాల్పడ్డారంటూ మంగళవారం ఈడీ కేసు నమోదు చేసింది.  మైనింగ్ తవ్వకాల్లో అక్రమాలకు పాల్పడ్డారంటూ ఈడీ ఆరోపణలు చేసింది. గత రెండు రోజులపాటు మహిపాల్ ఇంట్లో సోదాలు నిర్వహించిన ఈడీ  అధికారులు 300 కోట్ల రూపాయల వరకు ప్రభుత్వానికి నష్టం వాటిల్లేలా చేశారని పేర్కొన్నారు. మహిపాల్ సోదరుడు మధుసూదన్ రెడ్డి ఇళ్లలో కూడా గత వారం రోజుల క్రితం ఈడీ  సోదాలు నిర్వహించారు. మైనింగ్ తవ్వకాల్లో ప్రభుత్వానికి టాక్స్ చెల్లించకుండా ఎగ్గొట్టారని ఈడీ ఆరోపణలు చేసింది. సంతోష్ శాండ్ అండ్ గ్రానైట్ పేరుతో మహిపాల్ రెడ్డి వ్యాపారం చేస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు. 39 కోట్ల రూపాయల వరకు టాక్స్ ఎగ్గొట్టారని ఆరోపించారు. మహిపాల్ సోదరులు సంగారెడ్డి, పటాన్ చెరువు  పరిసర ప్రాంతాల్లో మైనింగ్ నిర్వహించేవారని, మైనింగ్ లో వచ్చిన లాభాలన్నీ రియల్ ఎస్టేట్ తో పాటు బినామీ పేర్లతో వ్యాపారాలు నిర్వహించినట్లు ఈడీ అధికారులు పేర్కొన్నారు.