కాకినాడ, మహానాడు : సార్వత్రిక ఎన్నికల్లో ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు, కాకినాడ రూరల్ ఎమ్మెల్యేగా పంతం నానాజీ విజయం సాధించాలని పాత గైగోలుపాడు టీడీపీ కూటమి కార్యకర్తలు పాదయాత్ర చేస్తామని మొక్కుకున్నారు.
మొక్కుకున్నట్టుగానే వారు గెలుపొందడంతో కాకినాడ రూరల్ కో కోఆర్డినేటర్ కటకంశెట్టి బాబీ ఆధ్వర్యంలో శనివారం పాదయాత్రగా అన్నవరం సత్యనారాయణ స్వామి సన్నిధికి బయల్దేరి మొక్కును తీర్చుకున్నారు.