సినీ పరిశ్రమలో విషాదం

ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ స్వప్నవర్మ ఆత్మహత్య 

హైదరాబాద్, మహానాడు :  తెలుగు సినీ పరిశ్రమలో విషాదం చోటు చేసుకుంది. ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న ఓ యువ కెరటం సరైన అవకాశాలు లేక నేల రాలింది. వివరాల్లోకి వెళితే… సినీ పరిశ్రమలో ఎగ్జిక్యూటివ్  ప్రొడ్యూసర్ గా పనిచేస్తున్న స్వప్నవర్మ (33) ఆత్మహత్య కు పాల్పడింది. హైదరాబాదులోని మాదాపూర్ కావూరి హిల్స్ లో తాను ఉంటున్న ఫ్లాట్ లో రెండు రోజుల క్రితం ఫ్యానుకు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారు. స్వప్న వర్మది రాజమండ్రి. మూడేళ్ళ క్రితం సినీ పరిశ్రమలో తన కలను సాకారం చేసుకునేందుకు హైదరాబాద్ వచ్చింది. గత ఆరు నెలలుగా ఏ ప్రాజెక్టు లేకుండా కాళీగా ఉండటంతో ఒత్తిడికి గురై ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది. ఆమె ఉంటున్న గది నుండి దుర్వాసన రావడంతో చుట్టుపక్కల వారు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించి, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా హాస్పిటల్ కు తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.