అమరావతి: టెట్ పరీక్ష కొత్త షెడ్యూల్ను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సోమవారం విడుదల చేసింది. అక్టోబర్ 3 నుంచి 20వ తేదీ వరకు టెట్ పరీక్షలు నిర్వహించనున్నట్టు ప్రభుత్వం వెల్లడించింది. ఇక అక్టోబర్ 4 నుంచి కీ విడుదల చేయనున్నట్టు, తుది ఫలితాలను నవంబర్ 2న విడుదల చేయనున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. రెండన ఇచ్చిన నోటిఫికేషన్ ప్రకారం వచ్చే నెల 8 వరకు పేమెంట్ గేట్ వే ద్వారా ఫీజు చెల్లించవచ్చునని, ఆన్లైన్ దరఖాస్తును సమర్పించేందుకు ఆగస్టు 3 వరకు గడువు ఉందని ప్రభుత్వం స్పష్టం చేసింది.