పిడుగురాళ్ల, మహానాడు: పిడుగురాళ్ల పట్టణం పిల్లుట్ల రోడ్డులోని లెనిన్ నగర్, మారుతి నగర్, లెనిన్ నగర్ లోని పట్టణ ఆరోగ్య కేంద్రం పరిధిలో డయేరియా బారిన పడి చికిత్స పొందుతున్న వారిని పల్నాడు జిల్లా కలెక్టర్ పి.అరుణ్ బాబు, గురజాల శాసనసభ్యులు యరపతినేని శ్రీనివాసరావు లు పరామర్శించారు. అనంతరం డయేరియా ప్రభావిత ప్రాంతాలను పరిశీలించి ఇలాంటివి మళ్ళీ పునరావృతం కాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలకు ఆదేశించారు.