స్పందించిన మంత్రి లోకేశ్
బాధితుడిని రాష్ట్రానికి తీసుకొస్తామని హామీ
అమరావతి, మహానాడు: కువైట్‌లో వేధింపులకు గురై దుర్భర జీవితం గడుపుతున్నామన్న తెలుగు కార్మికుడి వీడియోపై మంత్రి లోకేశ్ స్పందించారు. తనకు సాయం చేయకపోతే చావే దిక్కంటూ బాధితుడు సామాజిక మాధ్యమంలో వీడియో పోస్ట్ చేశాడు. వీడియోలోని వ్యక్తిని గుర్తించామని తెలుగుదేశం ఎన్ఆర్ఐ బృందం ఆయనను చేరుకుందని మంత్రి తెలిపారు. కేంద్ర సహకారంతో బాధితున్ని రాష్ట్రానికి తీసుకొస్తామని హామీ ఇచ్చారు.
మంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి నారా లోకేష్ ప్రజా సమస్యలపై దృష్టి పెట్టారు. తన దృష్టికి వచ్చిన సమస్యలపై వెంటనే స్పందించి వాటిని పరిష్కరించేందుకు కృషి చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన మంగళగిరి నియోజకవర్గంలో ప్రజా దర్బార్ కార్యక్రమం సైతం ఏర్పాటు చేశారు. ప్రజల నుంచి అనూహ్య రీతిలో స్పందనతో ఈ కార్యక్రమం కొనసాగుతోంది.
ప్రతి ఒక్కరి నుంచి వినతులను స్వీకరిస్తున్న లోకేశ్ వాటి పరిష్కారానికి కృషి చేస్తామని భరోసా ఇస్తున్నారు. కేవలం మంగళగిరి నియోజకవర్గంలోని సమస్యలపై మాత్రమే కాక తన దృష్టికి వచ్చిన పలు సమస్యలపై ఆయన స్పందించి పరిష్కారాలపై కృషి చేస్తున్నారు.