దేశానికే సంక్షేమాన్ని పరిచయం చేసిన వ్యక్తి ఎన్టీఆర్ 

-సింగపూర్లో ఘనంగా ఎన్టీఆర్ జయంతి వేడుకలు

సింగపూర్, మహానాడు: సింగపూర్ తెలుగుదేశం ఫోరం ఆధ్వర్యంలో అన్న నందమూరి తారక రామారావు 101వ జయంతి వేడుకలు సింగపూర్ లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాజమండ్రి రూరల్  ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి, పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర, తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావులు హాజరై ప్రసంగించారు.

గోరంట్ల బుచ్చయ్య చౌదరి మాట్లాడుతూ సామాజిక రాజకీయ ఆర్థిక సంస్కరణలకు నాంది పలికిన వ్యక్తి అన్న ఎన్టీఆర్ అంటూ ఎన్టీఆర్ తో తనకున్న అనుభవాలను పంచుకున్నారు. పేదకి కూడు గుడ్డ నీడ ఇలా దేశానికే సంక్షేమం పరిచయం చేసిన వ్యక్తి అన్న ఎన్టీఆర్ అని ధూళిపాళ్ల నరేంద్ర కొనియాడారు. బడుగు బలహీన వర్గాలకు రాజకీయాన్ని పరిచయం చేసింది ఎన్టీ రామారావు అని కొలికపూడి శ్రీనివాసరావు కొనియాడారు.

చంద్రబాబు సారధ్యంలో రాష్ట్ర పునర్నిర్మాణంలో పాలుపంచుకోవాలని  పిలుపునిచ్చారు. ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమానికి 800 మందికిపైగా అన్న ఎన్టీఆర్ అభిమానులు హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.