-విద్యార్థులకు అపార అవకాశాలు
-జీవితంలో ఉన్నత శిఖరాలు అధిరోహించాలి
-ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి
వెంకటాచలం, మహానాడు: మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు సహకారంతో వెంకటాచలం ఎడ్యుకేషనల్ హబ్ గా వెలుగొందుతోందని సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. వెంకటాచలం మండలం యర్రగుంటలోని కమ్యూనిటీ హాలులో విద్యార్థులకు స్కూలు కిట్ల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పాల్గొన్నారు. పాఠశాలకు వచ్చిన ఎమ్మెల్యే సోమిరెడ్డికి విద్యార్థులు, ఉపాధ్యాయులు ఘనస్వాగతం పలికారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ… పెద్దాయన వెంకయ్య నాయుడు సహకారంతో వెంకటాచలం ఎడ్యుకేషనల్ హబ్ గా వెలుగొందుతోంది. ఒక్క మెడికల్ కళాశాల తప్ప అన్ని రకాల విద్యాసంస్థలకు కేంద్రంగా మారిందన్నారు. జాతీయ స్థాయి సంస్థలు ఈ ప్రాంతంలో ఏర్పాటు కావడం మనందరికీ గర్వకారణం. రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగానికి అత్యంత ప్రాధాన్యం ఇస్తోంది. విద్యార్థులు అన్ని అవకాశాలను సద్వినియోగం చేసుకుని జీవితంలో ఉన్నత శిఖరాలు అధిరోహించాలన్నారు.
గత ప్రభుత్వం లక్షల కోట్లు అప్పు చేసి రాష్ట్రాన్ని ఆర్థిక సంక్షోభంలోకి నెట్టింది. పరిస్థితులను గాడిలో పెట్టడానికి సీఎం చంద్రబాబు నాయుడు అలుపెరగక శ్రమిస్తున్నారు. ప్రతి విద్యార్థికి ఉజ్వల భవిష్యత్ కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం అని పేర్కొన్నారు.