ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా

– ఎమ్మెల్యే గళ్ళా మాధవి

గుంటూరు, మహానాడు: ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేసి వారికి అండగా ఉంటానని గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గళ్ళా మాధవి అన్నారు. సోమవారం పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే కార్యలయంలో ప్రజల నుండి ఆమె వినతులు స్వీకరించారు.

ఈ సందర్భంగా ప్రజలు నుంచి వినతులు స్వీకరించి, కొన్నిటికి సంబంధిత అధికారులతో మాట్లాడి అక్కడే పరిష్కరించారు. ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్, గ్రాడ్యుయేట్స్ అసోసియేషన్ సభ్యులు రాష్ట్రంలో ఉన్న వెటర్నరీ పోస్టులు భర్తీ చేయాలని, దీనిని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లాలని ఎమ్మెల్యే గళ్ళా మాధవిని కోరారు.

అదేవిధంగా సయ్యద్ కాషిఫా అనే బాలిక శాశ్వత అంగవైకల్యంతో బాధపడుతూ, మంచానికే పరిమితం అయ్యిందని తమకు కుమార్తెకు పెన్షన్ ఇప్పించాలని ఎమ్మెల్యేను కోరగా త్వరలోనే పెన్షన్ మంజూరుకు కృషి చేస్తానని ఎమ్మెల్యే గళ్ళా మాధవి హామినిచ్చారు.