కార్మెల్ మాత దీవెనలు ప్రతి కుటుంబంపై ఉంటాయి

-తాడికొండ ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్ 
-ఘనంగా ఫిరంగిపురం కార్మెల్ మాత ఉత్సవాలు 

ఫిరంగిపురం, మహానాడు: ఫిరంగిపురంలో కార్మెల్ మాత ఉత్సవాలు మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఉత్సవాలకు తాడికొండ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కార్మెల్ మాత విగ్రహం వద్ద ఎమ్మెల్యే కొబ్బరికాయ కొట్టి ప్రార్థనలు నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రావణ్ కుమార్ మాట్లాడుతూ కార్మెల్ మాత దీవెనలు ప్రతి కుటుంబంపై ఉంటాయన్నారు. కార్యక్రమంలో ఫాదర్ ఫాతిమా మర్రెడ్డి, టీడీపీ నాయకులు పాల్గొన్నారు.