ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

– ఎమ్మెల్యే గళ్ళా మాధవి

గుంటూరు, మహానాడు:  చంద్రబాబు నాయుడు, ప్రజలు తన మీద పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని గళ్ళా మాధవి అన్నారు. గుంటూరు పశ్చిమ నియోజకవర్గం ఉద్యోగ నగర్ లోని సంజయ్ ఆర్కేడ్ అపార్ట్మెంట్ లో ఎమ్మెల్యే గళ్ళా మాధవికి అభినందన సభను ఏర్పాటు చేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే గళ్ళా మాధవి మాట్లాడూతూ.. గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ప్రజలు చాలా అనతి కాలములోనే తనను ఎంతగానో ఆదరించారని, నియోజకవర్గ చరిత్రలోనే ఎన్నడూ లేనంత భారీ మెజార్టీని కట్టబెట్టారని, ఈ మెజార్టీ తన మీద ఇంకా బాధ్యతను పెంచిందని గళ్ళా మాధవి తెలిపారు.

ఏడిఆర్ సంస్థ చేసిన సర్వేలో 61.58% ఓట్ల శాతం పొందిన మహిళా ఎమ్మెల్యేగా ముందు  నిలవటం అంటే చంద్రబాబు నాయుడు తనకు ఇచ్చిన గుర్తింపే అన్నారు. చంద్రబాబు నాయుడు, ప్రజలు తన మీద పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని గళ్ళా మాధవి హామీనిచ్చారు.