జిల్లాలో శాంతి భద్రతలు పరిరక్షించండి

పల్నాడు ఎస్పీని కలిసిన ఎమ్మెల్యే డా౹౹చదలవాడ

నరసరావుపేట, మహానాడు:  జిల్లాలో శాంతి భద్రతల పరిరక్షణ విషయంలో ప్రత్యేక దృష్టి సారించాలని నరసరావుపేట ఎమ్మెల్యే అరవింద బాబు జిల్లా ఎస్పీని  కోరారు. పల్నాడు జిల్లా నూతన ఎస్పీగా బాధ్యతలు చేపట్టిన కంచి శ్రీనివాసరావును నరసరావుపేట ఎమ్మెల్యే డా౹౹చదలవాడ అరవిందబాబు మర్యాద పూర్వకంగా కలిశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ..  గత ఐదేళ్ల పాలనలో పల్నాడు అంటే అరాచకాలు మాత్రమే గుర్తొచ్చేలా చేశారని తెలిపారు. జిల్లాలో గంజాయి మాఫియా పై ఎక్కువగా ఫిర్యాదులు వస్తున్నాయని, ఆ విషయంలో ప్రత్యేక దృష్టి సారించాలన్నారు.ప్రజా సమస్యల విషయంలో కూటమి ప్రభుత్వం చిత్తుశుద్ధితో పని చేస్తోందని, ఆ మేరకు పోలీసు యంత్రాంగాన్ని అప్రమత్తం చేయాలని ఎమ్మెల్యే డా౹౹చదలవాడ అరవిందబాబు కోరారు. డా౹౹చదలవాడ వెంట టీడీపీ నాయకులు కపిలవాయి విజయ్ కుమార్, గాడిపర్తి సురేష్, మహమ్మద్ రఫీ, ఖాసీం తదితరులు పాల్గొన్నారు.