అమరావతి, మహానాడు: టీడీపీ పార్లమెంటరీ సమావేశం సీఎం చంద్రబాబు అధ్యక్షతన శనివారం జరిగింది. ఈ సమావేశంలో ఏపీకి రావాల్సిన పెండింగ్ ప్రాజెక్టులపై చర్చించారు. మంత్రుల నుంచి వివిధ శాఖలకు చెందిన సమాచారాన్ని రాబట్టాలని ఎంపీలకు చంద్రబాబు ఆదేశించారు. కేంద్రంతో కూడా మంత్రులు సంప్రదింపులు జరపాలని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. అవసరమైతే ఎంపీలు మంత్రులను వెంటబెట్టుకుని కేంద్రమంత్రులను కలవాలని సీఎం సూచించారు.