ఏలూరు, మహానాడు: పది రోజుల క్రితమే జిల్లాకు మహిళా కలెక్టర్ గా బాధ్యతలు చేపట్టారు. అల్పపీడన ప్రభావంతో జిల్లావ్యాప్తంగా వరద నీరు ఉగ్రరూపం దాల్చింది. జిల్లా కార్యాలయంలో కూర్చుని ఆదేశాలివ్వొచ్చు.. కానీ అలా చేయకుండా. వర్షం కారణంగా ప్రజలు పడుతున్న ఇబ్బందులను స్వయంగా తెలుసుకోవాలని ప్రజల్లోకి వచ్చారు. ఆమె తెగువను చూసి వారెవ్వా… కలెక్టర్ అనక మానరు. ఆ అధికారి మరెవరో కారు. కొత్తగా వచ్చిన ఐఏఎస్ ఆఫీసర్ వెట్రీ సెల్వి.
అల్పపీడన ప్రభావంతో ఏలూరు జిల్లా వ్యాప్తంగా వరద నీరు ఉగ్రరూపం దాల్చింది. జిల్లాకు కొత్తగా వచ్చిన ఐఏఎస్ ఆఫీసర్ వెట్రీ సెల్వి జిల్లా కార్యాలయంలో కూర్చుని మానిటరింగ్ చేయకుండా.. వర్షం కారణంగా ప్రజలు పడుతున్న సమస్యలను స్వయంగా తెలుసుకోవాలనే సంకల్పంతో శుక్రవారం వేలేరుపాడు వచ్చారు.
కారు వెళ్ళలేని ప్రాంతానికి మోటార్ సైకిల్ పై వెళ్లి వరద పరిస్థితిని సమీక్షించి తీసుకోవలసిన చర్యలు గురించి హుటహుటిన ఆదేశాలు జారీ చేయటం ఆమెలో ఉన్న ధైర్య సాహసాలను తెలియజేస్తుందని చెప్పాలి. అలాగే గురువారం వేలేరుపాడు ప్రాంతంలోనే వరదలో చిక్కుకున్న వారిని సురక్షితంగా తీసుకురావటానికి హెలికాప్టర్ ను సైతం సిద్ధం చేసి జిల్లా, రాష్ట్ర ప్రజల మనసుల్లో సుస్థిర స్థానం పొందిన కలెక్టర్ వెట్రి సెల్వి ధైర్యాన్నీ ప్రజలు మెచ్చుకుంటున్నారు.