– రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు
అమరావతి, మహానాడు: రాష్ట్రంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న రైతులకు వ్యవసాయ శాఖ అధికారులు పూర్తి స్థాయిలో అందుబాటులో ఉండే విధంగా చూడాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి బుడితి రాజశేఖర్ కు రాష్ట్ర వ్యవసాయ, సహకార, మార్కెటింగ్, పశు సంవర్ధక, పాడి పరిశ్రమాభివృద్ధి, మత్స్య శాఖా మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు సూచించారు.
మంత్రి అచ్చెన్నాయుడు రాజశేఖర్ తో ఫోన్ లో మాట్లాడి పలు కీలక అంశాలపై చర్చించారు. రాష్ట్ర వ్యాప్తంగా తుఫాను కారణంగా పంట నష్టం అంచనా వేయాలని సూచనలు చేశారు.
జిల్లాల వారీగా వర్షపాతం ఎప్పటికప్పుడు నమోదు చేసి అందుకు సంబంధించిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. రైతు సమస్యల పరిష్కారానికి టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేయండి. తుఫాను ప్రభావంతో ఇబ్బందులు ఎదుర్కొనే రైతులకు క్షేత్ర స్థాయిలో సూచనలు అందించాలని మంత్రి తెలిపారు.