– మంత్రి లోకేశ్
అమరావతి : బంగ్లాదేశ్ లో అల్లర్ల నేపథ్యంలో అక్కడి తెలుగు విద్యార్థులను క్షేమంగా తిరిగి స్వదేశానికి తీసుకొస్తామని మంత్రి నారా లోకేశ్ ట్వీట్ చేశారు. బొంతా శేఖర్ అనే వ్యక్తి బంగ్లాలో MBBS చదువుతున్న తన కుమారుడు అలెక్స్‌ను రాష్ట్రానికి తీసుకొచ్చేలా చర్యలు తీసుకోవాలని లోకేశ్‌ను Xలో కోరారు.దీనిపై ఆయన స్పందించి చర్యలు చేపడుతున్నారు. కాగా ఇటీవల కువైట్‌లో చిక్కుకుపోయిన శివను మంత్రి స్వదేశానికి రప్పించారు.