– బి.జె.పి నేత పాలపాటి రవికుమార్
గుంటూరు, మహానాడు : గురువులే సమాజ మార్గ నిర్ధేశకులు అని భా.జ.పా రాష్ట్ర పబ్లిసిటీ అండ్ లిటరేచర్ కన్వీనర్ పాలపాటి రవికుమార్ అన్నారు. ఆదివారం ఆషాడ శుద్ధ పూర్ణిమ (గురు పూర్ణిమ) సందర్భంగా పలువురు గురువులను సన్మానించారు. పట్టాభిపురం మున్సిపల్ హైస్కూల్ పూర్వ ప్రధానోపాధ్యాయులు గడియారం రామకృష్ణ-రమణి దంపతులను, జె.కె.సి కళాశాల తెలుగు డిపార్టుమెంటు పూర్వసారధి పులిచర్ల సాంబశివరావు-భారతి దంపతులను, పి.ఈ.టి రాంబాబు, విద్యావేత్త, న్యాయవాది జూపూడి రంగరాజు, మహిళా అభ్యుదయవాది జూపూడి హైమావతిలను సాంప్రదాయ పద్ధతిలో శాలువా కప్పి పూలదండ వేసి ఘనంగా సత్కరించారు.
ఈ సందర్భంగా రవికుమార్ మాట్లాడుతూ సమాజాన్ని విరాట్ స్వరూపంగా భావించి విద్యారంగంతో పాటు పలు ఇతర రంగాలలో కూడా సేవలందించి తమ జీవితాలను సమాజ కళ్యాణానికి అంకితం చేసిన గురువులును గుర్తించి గౌరవించడం పూర్వ జన్మ సుకృతం అన్నారు. భగవంతునిలో ఐక్యం చెందే అర్హత పొందిన ప్రతి ఆత్మకు చివరి మజిలీ గురు సాంప్రదాయానికి పుట్టినిల్లు అయిన భారతదేశంలో జన్మ లభించటమేనన్నారు. తల్లిదండ్రులను,గురువులను భగవంతునితో సమానంగా గౌరవించుకోవడం యుగ యుగాలుగా భారతీయులు కొనసాగిస్తున్నారని అన్నారు.
ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఈదర శ్రీనివాసరెడ్డి, బీజేపీ రాష్ట్ర మీడియా కో కన్వీనర్ వెలగలేటి గంగాధర్ మండల అధ్యక్షుడు పెమ్మరాజు సుధాకర్, సురేష్ జైన్, బొలగాని సాంబయ్య, మహిళా నేత బొల్లాప్రగడ శ్రీదేవి, జితేంద్ర గుప్త, ముత్యం నరేంద్ర, జనసేన నేత తన్నీరు ప్రసాద్, పెద్దింటి కృష్ణ చైతన్య, మంచాల అశోక్ నాగసాయి, చింతపల్లి వెంకట్, మందలపు సురేష్, చంద్రశేఖర్, జెండా అంజిరెడ్డి, పొన్నగంటి కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.