–సేవా సంస్థల ఆధ్వర్యంలో రక్తదాన వారోత్సవాలు
కడప, మహానాడు : రక్తదానం ఒక దైవ కార్యంగా భావించి రక్తదానం చేసేందుకు యువత ముందుకు రావాలని కడప టౌన్ ఎస్సై రంగస్వామి అన్నారు. స్థానిక స్వచ్ఛంద సేవా సంస్థలు, నెహ్రూ యువ కేంద్రం సంయుక్త ఆధ్వర్యంలో చేపట్టిన రక్తదాన వారోత్సవాల్లో ముఖ్య అతిథిగా ఎస్సై రంగస్వామి పాల్గొన్నారు. కడప పాత బస్టాండ్లో మూడవరోజు రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. ఈ సందర్బంగా ఎస్సై మాట్లాడుతూ.. రక్తం ఏ ప్రయోగశాలలో తయారవదు, కాబట్టి అది కేవలం ఒక మనిషి మాత్రమే దానం చేయగలిగేది, కాబట్టి రక్తదానం ఒక దైవ కార్యంగా భావించి రక్తదానం చేసేందుకు యువత ముందుకు రావాలని పిలుపునిచ్చారు.
మరో అతిథిగా వికసిత ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు శూలం లక్ష్మీదేవి మాట్లాడుతూ కార్యక్రమంలో పాల్గొన్న యువతను చూసి స్ఫూర్తి పొందాలని ఇలాంటి పుణ్యకార్యంలో రక్తదానం చేసిన ప్రతి ఒక్క రక్తదాతకి పేరుపేరునా అభినందనలు తెలిపారు. ఈ రక్తదాన వారోత్సవాల్లో భాగంగా రక్తదానం చేసిన వారికి రక్తదానం చేయబోతున్న వారికి కృతజ్ఞతలు తెలుపుతున్నామని మదర్ థెరిస్సా చారిటబుల్ వ్యవస్థాపకుడు జూటూరు విజయ్ కుమార్, జేబీవీఎస్ వ్యవస్థాపకుడు, ఎన్.ఎస్.ఎస్. వాలంటీర్ అశోక్ అన్నారు.
ఈ కార్యక్రమంలో రిమ్స్ సిబ్బంది, సిఆర్ఐ సుబ్బారెడ్డి చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకుడు సునీల్ జయంత్, ప్రసాద్, ఈశ్వరయ్య, నాగ మల్లారెడ్డితోపాటు 25 మంది రక్తదాతలు స్వచ్ఛందంగా రక్తదానం చేశారు.