-అమరావతి స్మార్ట్ సిటీలో భాగంగా నిర్మిస్తున్న పలు భవనాలను పరిశీలించిన మంత్రి
-వెంకటపాలెంలో నిర్మాణంలో ఉన్న అంగన్వాడి సెంటర్, ఈ-హెల్త్ సెంటర్, మందడంలో నిర్మాణంలో ఉన్న అంగన్వాడీ భవనాన్ని పరిశీలించిన నారాయణ
రాజధాని గ్రామాలలో స్థానిక ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్ తో కలిసి మంత్రి నారాయణ పర్యటించారు. ఈ సందర్భంగా మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ మాట్లాడుతూ… రాష్ట్రంలో ఖజానా ఖాళీ అయింది.గత ప్రభుత్వం ఆర్థిక వ్యవస్థను నాశనం చేసింది.శాఖలవారీగా చేసిన కేటాయింపులను కూడా ఇతర అవసరాలకు ఖర్చు పెట్టేసింది. గత ప్రభుత్వం మూడు ముక్కలాట ఆడి అమరావతిని నాశనం చేసింది. వీలైనంత త్వరగా అమరావతి ప్రాజెక్ట్ పూర్తి చేసేలా ముందుకెళ్తున్నాం అని అన్నారు.
రాజధానిలో 17 అంగన్వాడీ సెంటర్లు,16 ఈ హెల్త్ సెంటర్లు,14 పాఠశాలలు,అన్ని సదుపాయాలతో కూడిన శ్మశాన వాటిక నిర్మిస్తున్నాం. వచ్చే నెలాఖరులోగా ఈ భవనాలన్నీ పూర్తిచేయాలని కాంట్రాక్టర్లకు ఆదేశాలిచ్చాం అని మంత్రి అన్నారు. ఆగస్టు నెలాఖరుకు అన్నీ పూర్తి చేసి సీఎంతో ప్రారంభం చేయిస్తాం అని హామీ ఇచ్చారు. అమరావతి నిర్మాణం పూర్తయి ఉంటే ప్రపంచంలో నెంబర్ వన్ గా ఉండేది. 100 రోజుల్లో కనీసం 100 అన్న క్యాంటీన్లు ప్రారంభించేలా చర్యలు చేపట్టాం అని మంత్రి నారాయణ అన్నారు.