రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి కేంద్ర ప‌థ‌కాలు ఊత‌మిస్తాయి

-ఏపీకి కేంద్రం ప్రత్యేక సాయం ప్రకటించడం ప‌ట్ల హ‌ర్షం
-ప్ర‌ధాన మంత్రి, కేంద్ర ఆర్థిక మంత్రి కి ప్ర‌త్యేక ధ‌న్య‌వాదాలు
-కేంద్ర సాయంతో స్వర్ణాంధ్ర సాధన దిశగా అడుగులు
-విజ‌య‌వాడ ఎంపి కేశినేని శివ‌నాథ్ (చిన్ని)

ఢిల్లీ : ఆంధ్ర‌ప్ర‌దేశ్ లోని ఐదు కోట్ల మంది ప్ర‌జ‌ల ఆకాంక్ష అమ‌రావ‌తి రాజ‌ధాని అభివృద్ది కోసం, కేంద్ర బ‌డ్జెట్ లో ఎపికి ప్ర‌త్యేక సాయం కింద 15 వేల కోట్ల రూపాయ‌లు సాయం ప్ర‌క‌టించ‌టం ప‌ట్ల విజ‌య‌వాడ ఎం.పి కేశినేని శివనాథ్ హ‌ర్షం వ్య‌క్తం చేశారు. ఎన్నిక‌ల్లో ఇచ్చిన హామీ ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ నిల‌బెట్టుకున్నారు.

గత ఐదేళ్ల కేంద్ర‌ బడ్జెట్‌లో ఆంధ్రప్రదేశ్ గురించి ఇంత ఎక్కువగా మాట్లాడలేదన్నారు. సీఎం నారా చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటనలు ఫలించాయన్నారు. ఏపీపై ప్రత్యేక దృష్టి సారించిన ప్రధాన మంత్రి న‌రేంద్ర‌ మోదీకి, కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామ‌న్ కి ఎంపి కేశినేని శివనాథ్ (చిన్ని) ప్ర‌త్యేక ధ‌న్య‌వాదాలు ఎక్స్ ద్వారా (ట్విట్ట‌ర్) తెలియజేశారు.