జగన్ రెడ్డి కుడికాలువ నిర్వహణను గాలికొదిలేశారు
అసెంబ్లీలో ముఖ్యమంత్రికి ఎమ్మెల్యే డా౹౹చదలవాడ వినతి
నరసరావుపేట, మహానాడు : వేలాది ఎకరాలను సస్యశ్యామలం చేసే నాగార్జున సాగర్ కుడికాలువ ఆధునికీకరణ పై ప్రత్యేక దృష్టి పెట్టాలని అసెంబ్లీ వేధికగా ప్రభుత్వాన్ని నరసరావుపేట ఎమ్మెల్యే డా౹౹చదలవాడ అరవింద బాబు విజ్ఞప్తి చేశారు.నాగార్జున సాగర్ కుడి కాలువ ద్వారా 136 కిలోమీటర్ల మేర సాగునీరు అందుతోందన్నారు. 2014-19 మధ్య కాలంలో రూ.5 వేల కోట్లతో కాలువ ఆధునికీకరణ పనులు చేశామని, కానీ, 2019-24 మధ్య కాలంలో జగన్ రెడ్డి రూపాయి కూడా కేటాయించలేదని, కనీసం పట్టించుకున్న పాపాన పోలేదన్నారు.రాష్ట్రంలో వ్యవస్థలు ఏస్థాయిలో విధ్వంసానికి గురయ్యాయో,వ్యవసాయం ఎంత నిర్లక్ష్యానికి గురైందనడానికి ఇది నిదర్శనం అన్నారు. కాలువలో పూడిక, తూడు, తుమ్మ చెట్లు పెరిగిపోయి నీరు పారే అవకాశమే లేకుండా పోయిందన్నారు. వ్యవసాయాన్ని బతికించుకోవాల్సిన బాధ్యత మన ప్రభుత్వంపై ఉందన్నారు. పోలవరాన్ని పూర్తి చేసేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని , అందులో కొంత మేరకు సాగర్ కుడికాలువ పై పెట్టాలని డా౹౹చదలవాడ విన్నవించారు.