నాడు-నేడు పై సమగ్ర విచారణ జరపాలి 

– పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ్ళ నరేంద్ర కుమార్

పొన్నూరు, మహానాడు :  గత ప్రభుత్వం చేపట్టిన నాడు-నేడుపై సమగ్ర విచారణ జరిపించాలని పొన్నూరు శాసనసభ్యులు ధూళిపాళ్ళ నరేంద్ర కుమార్ అసెంబ్లీలో డిమాండ్ చేశారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో నాడు – నేడు కింద దాదాపు 9000 కోట్ల రూపాయలు ఫేజ్ – 1, ఫేజ్ – 2 కింద ఖర్చు పెట్టారన్నారు. ఇంకా దాదాపు 4700 కోట్ల రూపాయలు ఉంటే గాని ఫేజ్ – 1, ఫేజ్ – 2 కింది చేపట్టిన పనులు పూర్తవుతాయి. నాడు–నేడు గత వైసీపీ ప్రభుత్వం అద్బుతాలు జరిగినట్లు ప్రచారం చేసుకున్నారని ఎద్దేవా చేశారు.

ఈ సందర్బంగా ఎమ్మెల్యే ధూళిపాళ్ళ నరేంద్ర మాట్లాడుతూ… నాడు – నేడు పేరు మీద పెద్ద ఎత్తున రాష్ట్రంలో దోపిడీ జరిగిందనేది వాస్తవం.  సెంట్రల్ ప్రొక్యూర్ మెంట్ పేరు మీద టెండర్లు పిలిచి స్థానికంగా కావలసిన ఫర్నిచర్, దీనిలోకి తీసుకువచ్చి వైసీపీ వాళ్ళకు టెండర్లు ఖర్చు పెట్టారు. ఫేజ్ – 1 కింద 15 వేల స్కూళ్ళు, ఫేజ్ – 2 కింది 22 వేల స్కూల్స్ తీసుకున్నారు. పొన్నూరు మున్సిపాలిటీలో  ఈ పనులు పరిశీలిస్తే పనులు చేయకుండా డబ్బులు డ్రా చేశారు.  పొన్నూరు మున్సిపాలిటీలో 5 స్కూళ్ళు పరిశీలించాము. 18 లక్షల రూపాయలు రిపేర్లు కోసం పెట్టి, 28 లక్షల రూపాయలు పనులు చేయకుండా డబ్బులు డ్రా చేశారు.

శ్రీరామ మున్సిపల్ హైస్కూల్లో పాత వాటికే రంగులు వేశారు, పాత టాయిలెట్లనే కట్టినట్లు చూపెట్టారు. వైసీపీ వారు ఎంచుకున్న మార్గం ఏంటంటే స్కూల్ స్థాయిలో పేరెంట్స్ కమిటీ, హెడ్మాస్టర్ ను బాధ్యులను చేశారు. వీరిని పెట్టి స్ధానిక వైకాపా నాయకులు. రాష్ట్రంలో పెద్ద నాయకులు దోచుకుంటే, పట్టణములో, మండలములోని స్థానిక వైకాపా నాయకులు స్కూళ్ళను పంచుకొని ఇష్టారాజ్యంగా పనులు చేయకుండా డబ్బులు డ్రా చేశారు. స్కూళ్లలో బాగున్న నాపరాయి ప్లోరింగ్ ను తీసి వేసి గ్రానైట్ రాయిని కొనాలని, గ్రనేట్ రాయిని మార్కెట్ కంటే ఎక్కువ ధరకు కొని అవసరం లేకపోయినా బాగున్న ప్లోరింగ్ తీసేసి గ్రనేట్ రాయి వేశారు.

వైసీపీ హయాంలో ఇసుక పెద్ద దోపిడీ. ప్రభుత్వ పనులకు ఇసుక ఉచితం అని చెప్పి వాటిని తోలినట్లు చూపించి, ఎవరైతే ఇసుక కాంట్రాక్టర్లు ఉన్నారో వారికి ఇక్కడ ఎక్కువ బిల్లులు చూపించి మినహాయింపు ఇచ్చారు. కొంత బయట మార్కెట్లో అమ్ముకున్నారు. నాడు – నేడు పేరు మీద పేద స్కూలు పిల్లలు చదవుకోవాల్సిన స్కూల్స్ కు చెందిన డబ్బులను వైకాపా నాయకులు, పెద్దలు పెద్ద ఎత్తున దోపిడీ చేశారు. వాటి పేరు మీద మొదలు పెట్టిన స్కూలు బిల్డింగ్ లు ఇప్పుడు ఆగిపోయాయి. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో ఉన్నాయి.

సగం కట్టారు. డబ్బులు డ్రా చేశారు. వైకాపా నాయకులు డబ్బులు తీసుకుని వెళ్ళారు. అవి మొండి గోడలుగా ఉండిపోయాయి. కాబట్టి స్కూల్ అవసరం కోసం వాటిని పూర్తి చేయాల్సి ఉందని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై విజిలెన్స్ విచారణకు ఆదేశిస్తారో, మరే విచారణకైనా ఆదేశిస్తారో మంత్రి నిర్ణయం తీసుకోవాలన్నారు.  వైసీపీ హయాంలో జరిగిన నాడు – నేడు పనుల మీద సమగ్ర విచారణ జరిపించాలని ఎమ్మెల్యే ధూళిపాళ్ళ నరేంద్ర పేర్కొన్నారు.