గిరిజన సర్పంచ్ గోడుపై స్పందించిన డిప్యూటీ సీఎం

అమరావతి, మహానాడు :  మూడేళ్లుగా వైసీపీ నాయకులతో పాటు పంచాయతీ కార్యదర్శి తనను వేధించి, బెదిరించి బలవంతంగా సంతకాలు చేయించుకున్నారని ఓ గిరిజన మహిళా సర్పంచ్ డిప్యూటీ సీఎంకు మొరపెట్టుకుంది. 

బుధవారం అసెంబ్లీ ఆవరణలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను కలిసిన నెల్లూరు జిల్లా ముత్తుకూరు సర్పంచ్ బూదూరు లక్ష్మి  తన గోడును వెళ్లబోసుకుంది. కోట్లాది రూపాయల నిధుల దుర్వినియోగంపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవడంతో పాటు వేధింపులకు గురైన తనకు న్యాయం చేయాలని వినతి పత్రం అందజేశారు.

వైసీపీ నేతలతో పాటు అధికారులపై సమగ్ర విచారణ జరిపి తగు చర్యలు తీసుకుంటామని, గిరిజన మహిళా ప్రజాప్రతినిధి లక్ష్మికి అండగా ఉంటామని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భరోసా ఇచ్చారు.