గుంటూరు, మహానాడు : మహాకవి గుర్రం జాషువా వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. స్థానిక నగరంపాలెం ఎస్బీఐ బ్యాంక్ ఎదురుగా ఉన్న గుర్రం జాషువా విగ్రహానికి పలువురు నేతలు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రివర్యులు డొక్కా మాణిక్య వరప్రసాద్, మాజీ మంత్రి రావెల కిషోర్ బాబు, ఎం జెఎస్ఎస్ నాయకులు పినపాటి మోహన్ రావు, అత్తోట జోసఫ్, దాసరి జాన్ బాబు, రాధా మాధ, బాబు రావు, ఈరి రాజశేఖర్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీసీ నాయకులు అన్నవరపు నాగమల్లేశ్వరరావు, తాడికొండ నరసింహారావు, వివిధ ప్రజా సంఘాల నాయకులు నల్లపు నీలాంబరం, సముద్రాల కోటేశ్వరావు తదితరులు పాల్గొన్నారు.