అమరావతి, మహానాడు : రాష్ట్రంలో పాఠశాల విద్య పరీక్షల షెడ్యూల్ ఖరారైంది. ప్రస్తుత విద్యా సంవత్సరానికి 1 నుంచి 10 తరగుతుల విద్యార్థులకు పరీక్షల షెడ్యూలును పాఠశాల విద్యాశాఖ ప్రకటించింది. ఫార్మెటివ్-1 పరీక్షలు ఆగస్టు 1 నుంచి 5 వరకు నిర్వహించనుండగా. ఫార్మెటివ్-2 పరీక్షలు సెప్టెంబరు 26-30 వరకు ఉంటాయి. సమ్మెటివ్-1 పరీక్షలు నవంబరు 1-15, ఫార్మెటివ్-3 వచ్చే జనవరి 2- 6 వరకు నిర్వహిస్తారు. పదోతరగతి విద్యార్థులకు ప్రీ ఫైనల్ పరీక్షలు వచ్చే ఫిబ్రవరి 10-20 వరకు ఉంటాయి. ఫార్మెటివ్-4 పరీక్షలు మార్చి 3-6 వరకు, సమ్మెటివ్-2 పరీక్షలు ఏప్రిల్ 7-18 వరకు నిర్వహిస్తారు.
పాఠశాలల సెలవులు
ప్రస్తుత విద్యా సంవత్సరానికి పాఠశాలల సెలవులు కూడా ప్రకటించారు. దసరా సెలవులు అక్టోబరు 4 నుంచి 13వరకు ఉంటాయి. క్రిస్టియన్ మైనార్టీ విద్యాసంస్థలకు దసరా సెలవులు అక్టోబరు 11 నుంచి 13 వరకు ఉంటాయి. క్రిస్మస్ సెలవులు డిసెంబరు 20 నుంచి 29 వరకు, సంక్రాంతి సెలవులు జనవరి 11 నుంచి 19 వరకు ఇవ్వనున్నారు.