-న్యూఢిల్లీలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నిరసన
-దాడులపై ఫోటో గ్యాలరీ
న్యూఢిల్లీ, మహానాడు : ఆంధ్రప్రదేశ్లో శాంతిభద్రతలు క్షీణించాయని, వైకాపాపై దాడులు జరుగుతున్నాయని మాజీ ముఖ్యమంత్రి, వైయస్సార్సీపీ అధ్యక్షుడు వైయస్.జగన్మోహన్ రెడ్డి అన్నారు. దాడులకు నిరసనగా న్యూఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం. చేపట్టారు. దాడులకు సంబంధించి ఫోటో గ్యాలరీ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా పార్టీ శ్రేణులు, మీడియాను ఉద్ధేశించి వైయస్ జగన్మోహన్ రెడ్డి మాట్లాడారు.
నిరసన కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి సోదరుడికి, స్నేహితుడికీ, ప్రతి అక్కచెల్లెమ్మకు మనస్ఫూర్తిగా ఒకవైపు కృతజ్ఞతలు. మరోవైపున ఇక్కడికి రాలేకపోయినా సంఘీభావం తెలిపిన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అక్కచెల్లెమ్మలకు, అన్మదమ్ములకు, అవ్వాతాతలందరికీ మనసారా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఇక్కడికి వచ్చి జరిగిన వాస్తవాలు తెలుసుకోవడంతో పాటు, జరిగిన వాస్తవాల మీద వాళ్ల అభిప్రాయాలు తెలియజేస్తూ సంఘీభావం తెలిపిన ప్రతి పార్టీకి, వాళ్ల నాయకులకు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని అన్నారు.
అదే విధంగా ప్రతి మీడియా హౌస్ నుంచి వచ్చిన ప్రతి జర్నలిస్టు.. ఇక్కడికి వచ్చి ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న వాస్తవాలను తెలుసుకున్నారు కాబట్టి.. వాళ్లు కూడా ఆంధ్రరాష్ట్రంలో జరుగుతున్న హేయమైన పనుల మీద గళం విప్పాలని విన్నవించుకుంటున్నాను. ఇక్కడికి వచ్చినందుకు వారికి కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నానన్నారు.