రాష్ట్ర హోంమంత్రి మాటలు కోటలు దాటుతున్నా చేతలు గడప దాటడం లేదని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి విమర్శించారు. ‘బొల్లి మాటలతో కాలక్షేపం చేయడం వల్లనే రాష్ట్రం భయం గుప్పిట్లోకి వెళ్లిపోయింది. బయటకు వస్తే ఏమవుతుందో తెలియని దారుణ స్థితి ఉంది. దీనికి బాధ్యత వహించి హోంమంత్రి రాజీనామా చేయాలి. హత్యలు జరగకుండా చూడడంలో కూటమి ప్రభుత్వం విఫలమైంది. ప్రభుత్వ వైఫల్యంపై గవర్నర్ విచారణకు ఆదేశించాలి’ అని డిమాండ్ చేశారు.