భూకబ్జాలపై ప్రభుత్వం దృష్టి పెట్టాలి
టీడీపీ సీనియర్ నేత, డొక్కా మాణిక్య వరప్రసాద్
గుంటూరు, మహానాడు: విద్యాశాఖలో అనేక పథకాల అమలుకు మంత్రి నారా లోకేష్ నూతన ఒరవడితో ముందుకెళ్తున్నారని టీడీపీ సీనియర్ నేత డొక్కా మాణిక్య వరప్రసాద్ అన్నారు. అబ్దుల్ కలాం, డొక్కా సీతమ్మ, సర్వేపల్లి రాధాకృష్ణ పేర్లతో విద్యావిధానంలో పథకాల అమలుకు నాంది పలకడం శుభపరిణామన్నారు.
ఈ సందర్బంగా డొక్కా మాణిక్య వరప్రసాద్ మాట్లాడుతూ… గతంలో ప్రతి విద్యా పథకంలో జగన్మోహన్ పేరుతో పెట్టి విద్యా విధానాన్ని సర్వనాశనం చేశారన్నారు. అలాగే రాష్ట్రవ్యాప్తంగా మాచర్ల, చిత్తూరు, శ్రీకాకుళం ఏరియాలలో వైసీపీ భూకబ్జాలపై ప్రభుత్వం దృష్టి పెట్టాలని సూచించారు. గత వైసీపీ హయాంలో భూకబ్జాలపై ప్రజలు తిరగబడటం చూస్తే త్వరలో రాష్ట్ర వ్యాప్తంగా రివర్స్ భూ కబ్జాలు పెడితే బాగుంటుందన్నారు. జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వెళ్లకుండా రాజ్యాంగాన్ని అపహాస్యం చేస్తున్నారన్నారు.