– 20 మందికి తీవ్ర గాయాలు
– కొనసాగుతున్న సహాయక చర్యలు
రాంచీ: ఝార్ఖండ్‌లోని చక్రధర్‌పూర్ వద్ద హావ్‌డా-సీఎస్‌ఎంటీ ఎక్స్‌ప్రెస్ పట్టాలు తప్పింది. మంగళవారం తెల్లవారుజామున జరిగిన ఈ ప్రమాదంలో ఇద్దరు మృతిచెందారు. మరో 20 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఘటనా స్థలానికి రైల్వే అధికారులు చేరుకున్నారు. ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చేందుకు ప్రత్యామ్నాయ ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు.
ఈ ప్రమాద ఘటనపై సమాచారం అందుకున్న వెంటనే రైల్వే శాఖ ఉన్నతాధికారులు ఘటన స్థలానికి చేరుకుని, సహాయక చర్యలు పర్యవేక్షిస్తున్నారని వివరించింది. సహయక చర్యలు కొనసాగుతున్నాయని చెప్పింది. అయితే ఈ ప్రమాదంలో గాయపడిన వారి సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని సౌత్ ఈస్ట్ రైల్వే డివిజన్‌లోని ఉన్నతాధికారి పేర్కొన్నారు.