జీవీఎల్ కు కృతజ్ఞతలు తెలియజేసిన మందకృష్ణ మాదిగ

ఇటీవల ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ల వర్గీకరణ పై రాష్ట్ర ప్రభుత్వాలకు అధికారం కల్పిస్తూ విద్యా , ఉద్యోగాలలో రిజర్వేషన్ల కోసం ఎస్సీ ఎస్టీ వర్గీకరణ అవసరమని సుప్రీంకోర్టు ధర్మాసనం తీర్పు వెలువరించిన నేపథ్యంలో… బిజెపి జాతీయ నాయకులు జీవీఎల్ నరసింహారావు మొదటి నుండి ఈ వర్గీకరణ గురించి పార్లమెంట్లో అనేక సందర్భాలలో ప్రస్తావిస్తూ, సమర్ధిస్తూ వర్గీకరణకు నైతికంగా మొదటి నుండి తన మద్దతును తెలియజేసినందుకు ఈరోజు ఎమ్మార్పీఎస్ అధినేత  మందకృష్ణ మాదిగ జీవీఎల్ ని ఢిల్లీలోని వారి స్వగృహంలో కలిసి కృతజ్ఞతలు మరియు శుభాకాంక్షలు తెలియజేశారు.

ఈ సందర్భంగా జీవీఎల్ మాట్లాడుతూ…ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ల వర్గీకరణ కొరకు తన జీవితాన్ని మొత్తం అంకితం చేసి దశాబ్దాలుగా ఎడతెగని పోరాటం జరిపిన మంద కృష్ణ మాదిగ కృషి ఫలితమే ఈ తీర్పు అని అన్నారు.

ఈ సందర్భంగా మంద కృష్ణ మాదిగకి జీవీఎల్ స్వీట్ తినిపిస్తూ వారికి, ఎమ్మార్పీఎస్ నాయకులు, కార్యకర్తలు మరియు ఈ తీర్పు ద్వారా లబ్ధి చేకూరేవారందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు.